*- పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం*
*- పేదల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం: టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి ,పర్వతనేని శ్రీధర్ బాబు
బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుక్కరాయసముద్రం మండలకేంద్రం లో ఉత్సాహంగా జరిగింది. పేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో.... వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను నేరుగా వారి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సహకార సొసైటీ చైర్మన్ కేశన్న, నూతన మండల కన్వీనర్ బి. లక్ష్మీనారాయణ, మాజీ మండల కన్వీనర్ అశోక్ కుమార్, టిడిపి నాయకులు ఎస్. నారాయణ స్వామి తదితరులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసి మాట్లాడారు
. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛన్ల మొత్తాన్ని పెంచి, ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ఈ 'ఎన్టీఆర్ భరోసా' నిజమైన భరోసాను కల్పిస్తోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర సంక్షేమ పథకాలను కూడా అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

